ఆ న‌లుగురికి మంత్రి ప‌ద‌వి గండం లేన‌ట్టేనా..?

ఏపీ రాజ‌కీయాల్లో అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ అధికార పార్టీలోనే తీవ్ర అల‌జ‌డులు చెల‌రేగుతున్నాయి.అదే మంత్రి ప‌ద‌వుల గొడ‌వ‌.

 Are Those Four Ministers Not Tention? Ycp Ministers, Jagan, Ap Potics , Botsa Sa-TeluguStop.com

ఇప్ప‌టికే రెండున్న‌రేండ్లు దాటుతుండ‌గా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వుల్లో మార్పులు చేస్తార‌న్న ఊహాగానాలు ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి.దీంతో త‌మ‌కే మంత్రి ప‌ద‌వి రావాలంటూ చాలామంది ఇప్ప‌టికే మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఇక మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న వారంతా గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.ఏ క్ష‌ణంలో త‌మ ప‌దవులు పోతాయో అని అంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు.

రాబోయే సంక్రాంతి త‌ర్వాత లేదంటే ఆలోపే ప్రక్షాళన ఖాయం అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే అంతా జ‌గ‌న్ ను మోక్షం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

చాలా వ‌ర‌కు ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేస్తార‌నే ప్ర‌చారం జోరందుకోవ‌డంతో అంద‌రూ నైరాశ్యంలో మునిగిపోతున్నారు.చాలామంది మంత్రులు అయితే త‌మ‌కు మంత్రి ప‌ద‌వి ముఖ్యం కాద‌ని త‌మ‌కు జ‌గ‌న్‌, పార్టీ మాత్ర‌మే ముఖ్యమంటూ ఓపెన్‌గా చెప్పేయ‌డంతో వారికి మంత్రి ప‌ద‌వులు రావ‌ని వెల్ల‌డిస్తున్నారు.

కాగా ఇప్పుడు ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో కొంద‌రు సైలెంట్‌గా ఉంటున్నార‌ని అలాంటి వారితో ఎలాంటి లాభం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారంట‌.

Telugu Ap Potics, Baddireddy, Balinani, Jagan, Kodali Nani, Ycp Ministers, Ys Ja

ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స‌మాధానం చెప్ప‌గ‌లిగే వారినే కేబినెట్‌లో ఉంచుకోవాల‌ని మిగ‌తా వారిని మార్చేయాల‌ని భావిస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.గ‌త రెండేళ్ల నుంచి ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్న న‌లుగురిని కంటిన్యూచేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.ఇందులో ముఖ్యంగా విజయనగరం బొత్స సత్యానారాయణ క‌చ్చితంగా ఉంటార‌ని స‌మాచారం.

అలాగే చిత్తూరు ప్ర‌తినిధిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కృష్ణా బ‌ల‌మైన నేత అయిన కొడాలి నాని అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్లు, జ‌గ‌న్‌కు న‌మ్మ‌క‌స్తులు అయిన వీరు కంటిన్యూ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube