ఏఆర్ రెహమాన్ భారత సినీ ప్రపంచం గర్వించే సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తెలియని వారంటూ ఉండరు.తన అద్భుతమైన సంగీతంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే ఈయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈయన సంగీతంతో మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా ఆస్కార్ అవార్డు అందుకొని భారత చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన రెహమాన్ కు కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.
ఈ విధంగా ఈయనను ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున అభిమానిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఈ క్రమంలోనే కెనడా దేశంలో ఒక వీధికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేరును పెడుతూ ఆయనకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో, ఆయనకు అక్కడ ఏ విధమైనటువంటి అభిమానం ఉందో తెలుస్తోంది.కెనడా దేశంలోని మార్కమ్ అనే పట్టణంలో ఒక వీధికి ఏఆర్ రెహమాన్ నామకరణం చేశారు.
అయితే ఈయన పేరును ఇలా వీదికి పెట్టడం ఇది తొలిసారి కాదు.
2013 వ సంవత్సరంలోనే ఇలా ఒక వీధికి రెహమాన్ పేరును పెట్టగా తాజాగా మరోసారి మార్కమ్ పట్టణంలో ఒక వీధికి ఈయన పేరు పెట్టడం విశేషం.ఈ విధంగా భారతదేశ సంగీత దర్శకుడు పేరును కెనడాలో ఒక వీధికి పెట్టడం ఆ దేశస్తులు ఆయనకు ఇచ్చిన అరుదైన గౌరవం అని చెప్పాలి.ఇక ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా తన పేరును ఒక వీధికి పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి అరుదైన గౌరవం తనకు దక్కుతుందని భావించలేదంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.