ఏపీ బీజేపీ( AP BJP ) కొత్త స్ట్రాటజీకి తెర తీయనుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇన్నాళ్ళు బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న జనసేన( Janasena ) ఊహించని విధంగా టిడిపితో పొత్తు ప్రకటించి బీజేపీని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది.
దీంతో ఇప్పుడు కాషాయ పార్టీ జనసేనతోనే పొత్తు కొనసాగించాల్సి వస్తే టీడీపీతో కూడా దోస్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కానీ బీజేపీ మొదటి నుంచి కూడా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోంది.
ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించనుంది అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసిన కమలనాథులు టీడీపీతో పొత్తును మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు.
దీంతో జనసేన బీజేపీ తెగతెంపులు చేసుకునే అవకాశం కూడా ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.
అయితే బిజెపి ఒంటరిగా బరిలోకి దిగితే పార్టీ భారీగా నష్టపోయే అవకాశం ఉంది.బీజేపీ కొత్త మిత్రపక్షం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.వైసీపీ మరియు బీజేపీ మద్య అంతర్గత సన్నిహిత్యం ఉందనేది జగమెరిగిన సత్యం.
బహిరంగంగా ఈ రెండు పార్టీల మద్య పొత్తు లేకపోయిన అంతర్గతంగా జగన్ కు ( CM Jagan ) కేంద్ర సహకారాలు ఉన్నాయనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన.ఈ నేపథ్యంలో వైసీపీతో పొత్తును( YCP ) అధికారికం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాషాయ పెద్దలు ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారట.
అందుకే వైసీపీని అధికారిక మిత్రపక్షంగా మార్చుకోవాలనేది బీజేపీ ప్లాన్ అంటూ కొన్ని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.అయితే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొత్తుల విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి పొత్తు పొట్టుకోదని, వంటరిగానే 175 స్థానాల్లో బరిలోకి దిగుతుందని మోడి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పుకొచ్చారు.
దీంతో ఒకవేళ బీజేపీతో చేతులు కలిపేందుకు జగన్ ఆసక్తి చూపే అవకాశం లేదనేది కొందరి మాట.కానీ మోడితో జగన్ కు ఉన్న సత్సంబంధాల కారణంగా బీజేపీ వైసీపీ మద్య పొత్తు కుదిరిన ఆశ్చర్యం లేదనేది మరికొందరు చెబుతున్నా మాట.మొత్తానికి జనసేన టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ చేయడంతో బీజేపీ తరువాత తీసుకునే స్టెప్ పై అందరి దృష్టి నెలకొంది.