గూస్ బంప్స్ తెప్పిస్తున్న నో ఎంట్రీ ట్రైలర్.. ఆండ్రియా అదరగొట్టేసిందిగా?

ఆండ్రియా జెరిమియా.ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా తడాఖా.

 Andrea Jeremiah Starrer No Entry Movie Trailer Released ,andrea Jeremiah , No En-TeluguStop.com

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తడాఖా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.తర్వాత కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.

ఆ తర్వాత తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.ఇది ఇలా ఉంటే ఆండ్రియా జెరిమియా తాజాగా నటించిన చిత్రం నో ఎంట్రీ.

ఆర్ అళుగు కార్తీకదీపం వహించిన ఈ సినిమాను జంబో సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ అరుణాచలం నిర్మించారు.

Telugu Adav Kannadasan, Akkineninaga, Andrea Jeremiah, Jayashree, John, Manas, T

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది.నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైన చంపేయగల శక్తి వాటి సొంతం.

అదే వాటి బలం పెరిగితే వాటి బలం పెంచేందుకు ఒక సైంటిస్ట్ చేసిన ప్రయోగం ఏమి అయ్యింది.అలాగే కుక్కల్లో పుట్టిన అతి భయంకరమైన వైరస్ మనుషులపై ఎలా దాడి చేసింది అనే ఉత్కంఠ భరితమైన సన్నివేశాల సమూహారంగా ఈ టైలర్ సాగింది.

కుక్కలు మనుషులను కలవడం ఆ తర్వాత మనుషులు మనుషులమే కలవడం వంటి సన్నివేశాలు సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి.

Telugu Adav Kannadasan, Akkineninaga, Andrea Jeremiah, Jayashree, John, Manas, T

ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటించిన ఆండ్రియా జెరిమియా తన నటనతో అదరగొట్టేసింది.ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా థ్రిల్లింగ్ అలాగే ఇంట్రెస్టింగ్ గా రోమాలు నిక్కబడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను రూపొందించారు.ఈ సినిమా ట్రైలర్ నీ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఆండ్రియా జెరిమియా తోపాటుగా అదవ్ కన్నదాసన్,రన్య రావ్, మానస్, జయశ్రీ,జాన్ వీ తదితరులు కీలకపాత్రలో నటించారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube