అమెరికన్ వింత బిజినెస్...లాక్ డౌన్ మార్చేసిన జీవితం....

ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి ప్రాణ, ఆర్ధిక నష్టాలను మిగల్చడమే కాదు, గొప్పగా, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చేసింది.దాంతో ఎంతో మంది ఉపాది లేక ప్రభుత్వం నుంచీ ఎలాంటి సాయం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

 American Strange Business  Locked Down Changed Life  , American, Corona, Brantle-TeluguStop.com

దాంతో చేసేది లేక చిన్నా చితక పనులు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.అయితే అందరూ ఒకేలా ఆలోచన చేస్తే ఎలా కాస్త డిఫరెంట్ గా ఆలోచిద్దాం అనుకున్న ఓ అమెరికన్ అనుకున్నట్టుగానే ఓ వింత బిజినెస్ మొదలు పెట్టాడు.

కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా తన కుటుంభం కోసం, వారి ఆకలి తీర్చడం కోసం ఓ అమెరికన్ వింత వేషం వేస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు.అమెరికాలోని అలబామాకు చెందిన 32 ఏళ్ళ బ్రాంట్లీ అనే వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు.

అందుకు అధైర్య పడకుండా జంతువులా వేషం వేసుకుని అతడు ఉండే ప్రాంతాలలో తిరగడం మొదలు పెట్టాడు.ఎందుకు అలా చేయడం అని అడిగితే లాక్ డౌన్ కారణంగా పిల్లలు బయటకు రానివ్వకుండా ఆపడం తల్లి తండ్రుల వలన కాదని, వారు బయటకు రాకుండా ఉండాలంటే భయపెట్టాలని అందుకే తాను బయపెట్టేలా ఈ వృత్తిని ఎంచుకున్నానని తెలిపాడు.

అలా చేయడం వలన తనకు డబ్బులు కూడా వస్తున్నాయని తెలిపాడు.

అయితే ఒక రోజు తన వద్దకు ఇద్దరు పిల్లల తండ్రి వచ్చి తన పిల్లలని బయపెట్టాలని అందుకు 20 డాలర్లు ఇస్తానని చెప్పడంతో వెళ్లానని అక్కడ తాను సక్సస్ అయ్యానని, ఆ తరువాత అందరికి నా విషయం తెలియడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయని, రోజుకు సుమారు 15 నుంచీ 20 మంది తమ పిల్లలను బయపెట్టాలని తనను సంప్రదిస్తున్నారని, దాంతో ప్రస్తుతం తన బిజినెస్ సూపర్ గా ఉందని, లాక్ డౌన్ తనకు కొత్త పాతం నేర్పిందని అంటున్నాడు.ప్రస్తుతం అతడు పిల్లలను బయపెట్టేందుకు విభిన్న వేషాలు వేస్తూ ఒక్కొక్కరి వద్ద నుంచీ రూ.2300 వరకూ వసూలు చేస్తున్నాడట.లాక్ డౌన్ కొందరికి అనర్ధాలు తీసుకువస్తే యితడు మాత్రం లాక్డ్ డౌన్ ను తెలివిగా బిజినెస్ లా మార్చేసుకున్నాడు.గ్రేట్ కదా…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube