టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్లను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది.అయితే వారు ఈ సినిమా కోసం ఇంకా షూటింగ్ మొదలుపెట్టకపోవడం గమనార్హం.
ఆలియా భట్ బాలీవుడ్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా కోసం ఆమె ఇంకా రెడీ కాలేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో ఆలియా భట్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
అయినా కూడా ఆమెతో తమ చిత్రానికి ఎలాంటి నష్టం వాటిల్లబోదని ధీమాగా ఉన్న జక్కన్న, వీలైనంత త్వరగా ఆలియాతో షూటింగ్ జరపాలని చూస్తున్నాడు.
ఇక ఆర్ఆర్ఆర్ను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న ఆలియా కూడా ఈ సినిమా కోసం తనదైన మార్క్‌తో వెళ్లేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో ఆమె పాత్రకు తెలుగు డబ్బింగ్ ఆమెనే చెప్పాలని రాజమౌళి కోరాడట.దీంతో ఆలియా కూడా ఈ విషయంపై పచ్చజెండా ఊపేసింది.
మరి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారి తెలుగులో నటించడమే కాకుండా, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుండటం నిజంగా విశేషం అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.