యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.సాహో చిత్రం తరువాత రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్, ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే సగానికిపైగా పూర్తి చేశాడు.
దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
కాగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్ ఉంటుందా అని దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ అడగ్గా, ఆయన వారికి ఓ స్వీట్ న్యూస్ చేప్పాడు.
ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓ కిల్లర్ అప్‌డేట్‌ను బయటకు వదులుతామని నాగ్ అశ్విన్ చెప్పాడు.
దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ప్రభాస్ తన 22వ చిత్రంగా ఆదిపురుష్ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇలా మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్ తన పుట్టినరోజు కానుకగా ఎలాంటి గిఫ్ట్‌లు ఇస్తాడో చూడాలి అని ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.