టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి ముందు అంటే జనవరి 8వ తారీకున విడుదల చేయాలని భావించారు.కరోనా వచ్చి ఉండకుంటే ఖచ్చితంగా అదే తేదీన విడుదల చేసేవారు.
ఆ తేదీకి ముందు జులై 30న అంటూ కూడా మేకర్స్ ప్లాన్ చేశారు.అప్పుడు షూటింగ్ కు అంతరాయం కలగడం వల్ల సంక్రాంతికి వాయిదా వేశారు.
ఇప్పుడు మళ్లీ కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది.దాదాపుగా ఏడు నెలల పాటు షూటింగ్ పూర్తిగా నిలిచి పోయింది.
ఆ సమయంలో కనీసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయలేక పోయారు.దాంతో సినిమా మళ్లీ వాయిదా పడటం ఖాయం.
సంక్రాంతి నుండి వాయిదా పడ్డ సినిమాను మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తాడు అంటూ జక్కన్న నిర్ణయం కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
బాహుబలితో రికార్డులు బ్రేక్ చేసిన రాజమౌళి ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు.కనుక ఖచ్చితంగా సినిమా మరో బంపర్ హిట్ అవుతుంది.ఇంత నమ్మకం ఉన్న సినిమాను సరైన సమయంలో విడుదల చేస్తేనే అంచనాలను అందుకోవడంతో పాటు వసూళ్ల విషయంలో టార్గెట్ రీచ్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
అద్బుతమైన సినిమాను ఒక మంచి తేదీన విడుదల చేస్తే కోట్లు కురవడం ఖాయం.
అందుకే ఈ సినిమాను కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లు ఇతర మాల్స్ అన్ని పూర్తి స్థాయిలో నడిచే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.అంటే వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇది ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీ కనుక ఆగస్టు 15న విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో కూడా మేకర్స్ ఉన్నారు.మరి వారి తుది నిర్ణయం ఏంటీ అనేది త్వరలో రాబోతున్న ఎన్టీఆర్ వీడియోలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.