కొత్తవాళ్లతో రాఘవేంద్రుడు సినిమా... అదే మ్యాజిక్ రిపీట్

టాలీవుడ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీలు, కమర్షియల్ ఎంటర్టైనర్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు.

 K Raghavendra Rao Upcoming Movie Update, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో రాఘవేంద్రుడు కూడా ఉంటాడు.హీరోయిన్స్ ని అందంగా చూపించాలంటే అది కేవలం రాఘవేంద్రరావుకి మాత్రమే సాధ్యం.

అలాగే పాటలకి సొగసు తీసుకొచ్చిన దర్శకుడు అంటే దానికి కూడా రాఘవేంద్రరావు పేరునే వినిపిస్తుంది.ఇలా కళాపోషకుడుగా అరుదైన ఘనత వహించిన రాఘవేంద్రరావు కమర్షియల్ జోనర్ చిత్రాల నుంచి భక్తిరస చిత్రాల వైపు దృష్టి పెట్టాడు.

అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, షిర్డీ సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్నారు.అయితే చాలా కాలం తర్వాత మరల తనకి అలవాటైన రొమాంటిక్ జోనర్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
లాక్ డౌన్‌కి ముందు ఓ ప్రాజెక్టు అనుకున్నారు.కానీ పరిస్థితుల ప్రభావం వలన సెట్స్ పైకి వెళ్ళలేదు.ఇప్పుడు ఆ ప్రాజెక్టే పట్టాలెక్కించ‌బోతున్నారు.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంది.

న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని తెలియ‌జేయ‌నున్నారు.దాదాపు అంతా కొత్త‌వారితో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది.

స్క్రిప్టు ఇప్ప‌టికే సిద్ధ‌మైపోయింది.పెళ్లి సంద‌డి టైపులో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఎప్ప‌టిలానే సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్నారు.రాఘ‌వేంద్ర‌రావు నిర్మాణ‌, ద‌ర్శ‌క‌త్వ సార‌ధ్యంలో ఓ సినిమా కూడా మొద‌ల‌వ్వ‌బోతోంది.

నాలుగు గొలుసు క‌థ‌ల స‌మాహారం ఈ సినిమా.దానికి సంబంధించిన డీటైల్స్ కూడా త్వ‌ర‌లో చెప్పే అవ‌కాశం వుంది.

మరి రాఘవేంద్ర రావు సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఆ అదృష్టవంతులు ఎవరనేది తెలిసిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube