ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) తో అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ( Gautham Adani ) భేటీ కావడం జరిగింది.తాడేపల్లి లోని సీఎం నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై జగన్ తో అదానీ చర్చించడం జరిగింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వ్యాపార సంబంధాలపైన కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ భేటీ అనంతరం సీఎం జగన్ మరియు అదానీ డిన్నర్ చేయనున్నారట.ఇప్పటికే విశాఖలో అదానీ గ్రూప్ సెంటర్ కు ప్రభుత్వం వందల ఎకరాలు ఇవ్వటం జరిగింది.
అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా పనులు ప్రారంభించలేదని విమర్శలు వస్తూ ఉన్నాయి.ఇలాంటి పరిస్థితులలో సీఎం జగన్( CM Jagan ) తో అదానీ భేటీ కావడం సంచలనంగా మారింది.
కాగా ఈ భేటీ కోసం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అదానీ.నేరుగా తాడేపల్లి( Tadepalle ) లోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు పలు ప్రాజెక్టులను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలో సీఎం జగన్ తో అదానీ భేటీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.