పావు కిలో ఉప్పు రూ.7,600.. ఎక్కడంటే...?

షడ్రుచులలో ఉప్పు ఒకటి.మన భారతీయ వంటకాల్లో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

 A Quarter Kilo Of Salt Is Rs 7,600 Where , 250 Grams , Salt , 7600 , Bamboo Sal-TeluguStop.com

ఆహారానికి రుచిని ఇవ్వడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది.అలాంటి ఉప్పు రేటు ఎంతుంటుంది.? మహా అయితే కేజీ రూ.20 లేదా రూ.30 ఉంటుంది.ఒకవేళ పింక్ హిమాలయన్ సాల్ట్ అయితే.రూ.100 నుండి రూ.200 మధ్యలో ఉంటుంది.అంతేకానీ కేవలం పావుకిలో ఉప్పుకు ఎక్కడైనా రూ.7,500 ఉంటుందా.అని ఎవరైనా అడిగితె కొరియన్‌ స్టైల్‌లో తయారు చేసే ఉప్పుకు ఉంటుంది మరి.‘అమెథిస్ట్ బాంబూ సాల్ట్’ కు మార్కెట్ లో ఎంతో ఎక్కువ ధర పలుకుతుంది.అంతలా ఏముంది ఆ ఉప్పులో అనుకుంటున్నారు కదా.అయితే దాని గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు పేరు బాంబూ సాల్ట్‌.

దీన్నే ‘పర్పుల్‌ సాల్ట్‘ అని కూడా అంటారు.మనం వెదురు బొంగులను కత్తిరించి వాటిలో చికెన్ ని వేసి.

ఉడికించి బొంగులో చికెన్ గా పిలవడం చూసుంటాం.దాన్ని తినుంటాం కూడా.

అలానే సముద్రపు ఉప్పును వెదురు బొంగుల్లో వేసి దాన్ని సిరామిక్‌ రకం బంకమన్నుతో మూసేస్తారు.అనంతరం ఆ బొంగులను బట్టీలో ఉంచి కేవలం కలప మంట పైనే కాల్చుతారు.

తర్వాత ఆ బొంగును అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు.

Telugu Grams, Amethystbamboo, Bamboo Salt, Himalayan Salt, Purple Salt, Salt-Lat

ఇలా దాదాపు 14 నుంచి 15 గంటలు కాల్చడం వలన బొంగు మొత్తం కాలిపోయి కేవలం ఉప్పు ముద్ద మిగులుతుంది.దీన్ని మళ్లీ పొడి చేసి మళ్లీ బొంగులో నింపి కాలుస్తారు.ఇలా అనేకసార్లు బొంగును కాల్చడంతో ఉప్పు రంగు కూడా మారిపోతుంది.

గట్టిగా రాయిలా తయారవుతుంది.తర్వాత ఈ ఉప్పును బయటకు తీసి పొడిలా చేసి అమ్ముతారు.

దీని తయారీకి సుమారు 50 రోజుల సమయం పడుతుంది.ఈ ఉప్పులో అత్యధిక ఖనిజాలు ఉంటాయి.

దీనిని వాడడం వలన కడుపులో మంట తగ్గుతుంది.అంతేకాక క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పలువురు వెల్లడించారు.

అందుకే, ఈ ఉప్పుకు అంత డిమాండ్ అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube