కొత్త ఆటోతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. బెంజ్ కారు కొన్నవారికంటే హ్యాపీగా ఉన్నాడే..?

కొంతమందికి ఎంత ఆస్తి ఉన్నా ఆనందంగా గడపలేరు.జీవితంలో ఏదో ఒక వెలితి ఉన్నట్లు వారు నిరాశ, నిస్పృహలతో బతుకు నెట్టుకొస్తుంటారు.

 A Person Who Took A Selfie With A New Auto Is Happier Than Someone Who Bought A-TeluguStop.com

కొంతమంది ఆర్థికంగా బీద స్థితిలో ఉన్న చిన్న చిన్న వాటికే మంచిగా సంతోషిస్తూ హ్యాపీగా బతికేస్తుంటారు.తాజాగా ఒక వ్యక్తి తన కొత్త ఆటో-రిక్షాతో సెల్ఫీ తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన ముఖంలో విజయం సాధించాననే గర్వం స్పష్టంగా కనిపిస్తుంది.

వీడియోపై ఉన్న “ఇది కష్టపడి పని చేయడం వల్ల అందిన ఫలితం” అని అర్థం వచ్చేలా ఒక టెక్స్ట్ మెసేజ్ రాశారు.

ఒక సోషల్ మీడియా వినియోగదారు “ఎంత చిన్న కొనుగోలు అయినా కష్టానికి ప్రతిఫలం లభించినప్పుడు సంతోషం వేస్తుంది.” అనే సందేశంతో ఈ వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఒక వ్యక్తి తన కొత్త ఆటో-రిక్షాతో సెల్ఫీ తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఆటో-రిక్షా( Auto-rickshaw ), ఆ వ్యక్తి కష్టపడి పనిచేసిన ఫలితం విలువ ఖరీదైన మెర్సిడెస్ కారుకు సమానంగా ఉంటుందని కొందరు పేర్కొన్నారు.ఈ వీడియో, ఏప్రిల్ 17న పోస్ట్ చేయగా దీనికి ఇప్పటికే 300,000 కంటే ఎక్కువ వ్యూస్, 22,000 కంటే ఎక్కువ లైక్స్‌ వచ్చాయి, ఇది చాలా మంది ప్రజల హృదయాలను టచ్ చేసింది.

ఈ వీడియో మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది.అదేంటంటే జీవితంలో విజయం అనేది ఒకే ఒక ప్రమాణంతో కొలవలేము.ఒక్కొక్కరికీ ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విజయం చాలా ముఖ్యమైనది.ఒక వస్తువు విలువ దాని ధర ట్యాగ్‌ ఆధారంగా నిర్ణయించలేమని, దాని వెనుక ఉన్న కష్టం, అంకితభావం మాత్రమే దాని వాల్యూ ని పెంచుతుందని కొందరు పేర్కొన్నారు.

ఈ ఆటో ఓనర్ బెంజ్ కారు కొన్న వారి కంటే సంతోషంగా ఉన్నాడని మరికొందరు కామెంట్లు చేశారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube