ప్రపంచంలో మానవత్వం, మంచితనం రెండు కనిపించకపోయే భయం రోజురోజుకు పెరిగిపోతుంది.ప్రస్తుత కాలంలో అందరూ చదువుకున్న కానీ.
ఎవరికి వారు నచ్చినట్లుగా ఉండడంలో అనేక అనర్ధాలు సంభవిస్తున్నాయి.కొందరు చదువుకున్న మూర్ఖులు వారి సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి వారు సంతోషపడటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనించవచ్చు.
ముఖ్యంగా కొందరు సంతోషంగా ఉండడానికి ఎదుటివారిని హింసించడానికి కూడా వెనకడుగు వెయ్యట్లేదు అంటే ఆలోచించండి.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో గురించి చూస్తే.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్( Sangareddy District Narayankhed ) పట్టణంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది.ఓ మహిళను వేధిస్తున్న డిప్యూటీ తాసిల్దార్( Deputy Tahsildar ) బాగోతం బయటపడింది.మహిళను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న చిత్తూరు తాసిల్దార్ చెంప పగిలేలా కొట్టింది ఓ ఇల్లాలు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నారాయణఖేడ్ పట్టణంలో ఇంట్లో తాసిల్దార్ నివాసం ఉంటుండగా.
అతడు నివాసం ఉన్న పక్కనే ఉన్న పోషన్ లో ఓ మహిళ పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

సదరు మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న డిప్యూటీ తాసిల్దార్ పై చెంప చెల్లుమనేలా చేయి చేసుకుంది.తాసిల్దార్ ఇంట్లో ఉన్న సమయంలో సదర మహిళ యొక్క ఫోటోలు, వీడియోలు తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ మహిళను ఇబ్బంది పెడుతున్నాడు.ఇక డిప్యూటీ తాసిల్దార్ ఆగడాలని భరించలేక కోపం వచ్చి అతనిపై చేయి చేసుకున్నట్లు ఆవిడ తెలిపింది.అలా చేయి చేసుకున్న విషయాన్ని సదరు మహిళా తన భర్తకి తెలపడంతో.
వారి ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా తీసుకొని పోలీసులు డిప్యూటీ తాసిల్దార్ పై కేసును నమోదు చేశారు.







