అద్దం ముందు పర్సుతో ఫోజులు ఇచ్చిన కుక్క.. వీడియో వైరల్

A Dog Who Gave Food With A Purse In Front Of The Mirror The Video Is Viral, Dog, Talent, Viral Latest, News Viral, Social Media, Viral Video

ఇంట్లో పెంపుడు జంతువులను చాలా మంది అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరిగా వాటిని భావిస్తారు.

 A Dog Who Gave Food With A Purse In Front Of The Mirror The Video Is Viral, Dog,-TeluguStop.com

ఆ కుక్క పిల్లలకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే చాలా బాధ పడుతుంటారు.వెంటనే వెటర్నరీ వైద్యుల వద్దకు వాటిని తీసుకెళ్తుంటారు.

ఇక వాటికి ప్రత్యేకమైన ఫుడ్ పెడుతుంటారు.ఇక పెంపుడు కుక్కలు( pet dogs ) కూడా తమ యజమానుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి.

ఎవరైనా ఇంట్లో దొంగలు పడితే వారిని పరుగులు పెట్టిస్తాయి.ఇక కొన్ని సందర్భాల్లో పాములు, పులులు వంటి వాటితో పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీడియోలను మనం చూశాం.

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువుగా కుక్కను చెబుతుంటారు.ఈ కుక్కలు కూడా చాలా సరాదాగా ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో చాలా చిలిపిగా ప్రవర్తిస్తాయి.ఇలాంటి ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ కుక్క చాలా వయ్యారంగా అద్దం ముందు నిల్చుంది.ముందుగా మెడలో అది చిన్న పర్సును( purse ) తగిలించుకుంది.తర్వాత అద్దం ముందు ఫోజులు ఇచ్చింది.ఆ అద్దం ముందు తొలుత తన కాలు ఒకదానిపై మరొకటి వేసి కూర్చుంది.నేలపై ఉన్న ఆ అద్దం ముందు తన అందం చూసుకుంది.పైగా మెడలో పర్సు కూడా ఉండడంతో దాని స్టైల్‌ కూడా అలవాటు అయినట్లు అనిపిస్తోంది.

తర్వాత తన అందం అద్దంలో చూసుకుని ఆ కుక్క మురిసిపోయింది.ఈ వీడియోను @twperritos అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.కుక్క స్టైల్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అది తన యజమానులను చూసి ఇలా నేర్చుకుందేమోనని సరాదాగా కామెంట్లు పెడుతున్నారు.ఆ కుక్క చాలా బాగుందని, అద్దం ముందు రెడీ అయ్యే దాని ప్రవర్తను తమను ఆకట్టుకుందని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube