ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్ సభా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.యూపీఏ ప్రభుత్వ హయాంలో విభజన సరిగా జరగలేదని తెలిపారు.
విభజనతో విద్వేషాలు చెలరేగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారీ ప్రయాసతో జరిగిందన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటులో రక్తం ఏరులై పారిందని తెలిపారు.విభజన తరువాత రెండు రాష్ట్రాలు సంబరాలు చేసుకోలేకపోయాయని వెల్లడించారు.
అటు ఏపీలో కానీ, తెలంగాణలో కానీ సంబరాలు జరగలేదన్నారు.తరువాత ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందన్న ప్రధాని మోదీ ఈ విభజన సమయంలో ఎటువంటి సమస్యా తలెత్తలేదని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.