ఉమ్మడి ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్ సభా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో విభజన సరిగా జరగలేదని తెలిపారు.విభజనతో విద్వేషాలు చెలరేగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారీ ప్రయాసతో జరిగిందన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటులో రక్తం ఏరులై పారిందని తెలిపారు.

విభజన తరువాత రెండు రాష్ట్రాలు సంబరాలు చేసుకోలేకపోయాయని వెల్లడించారు.అటు ఏపీలో కానీ, తెలంగాణలో కానీ సంబరాలు జరగలేదన్నారు.

తరువాత ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందన్న ప్రధాని మోదీ ఈ విభజన సమయంలో ఎటువంటి సమస్యా తలెత్తలేదని వెల్లడించారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?