ఆర్టీసి బస్సులో ప్రయాణించిన కలెక్టర్

నల్లగొండ జిల్లా: మహిళలకు మహాలక్ష్మి పథకం( Mahalakshmi Scheme ) ఒక వరమని, సూర్యాపేట జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( S Venkatrao ) అన్నారు.

నేరుడుచర్లలో జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యలో సూర్యాపేట నుండి మిర్యాలగూడెం వెళ్తున్న ఆర్టీసి బస్సులో కలెక్టర్ ప్రయాణం చేసి మహిళలను పలకరించి ప్రభుత్వ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో మొదట మహాలక్షి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం( TS Rajiv Aarogyasri Scheme ) పరిమితిని రూ.10 లక్షల పెంచడం జరిగిందన్నారు.అర్హులైన ప్రజలకు అభయహస్తం పథకాలు అందుతాయన్నారు.

A Collector Traveling In An RTC Bus , Mahalakshmi Scheme, Suryapet District , S

జిల్లాలో ఉచిత ప్రయాణానికి ముందు ఆర్టీసీలో రోజుకు 51,500 వరకు ఉంటూ 40 శాతం మంది మహిళల ప్రయాణం ఉండేదని,ఆర్టీసీ ఉచిత ప్రయాణంలో ప్రస్తుతం 75,500 మంది ప్రయనిస్తున్నారని,ఇందులో భాగంగా జిల్లాలో మహిళలు 60 శాతం బస్సు ప్రయాణం వినియోగించుకుటున్నారని తెలిపారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News