అండర్-19 ప్రపంచ కప్ జట్టులో హైదరాబాద్ క్రికెటర్లకు ఛాన్స్..భారత తుది జట్టు ఇదే..!

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు తుది జాబితాను బీసీసీఐ( BCCI ) తాజాగా వెల్లడించింది.హైదరాబాద్ క్రికెటర్లకు ఈ జట్టులో చోటు లభించింది.

 A Chance For Hyderabad Cricketers In The Under-19 World Cup Team This Is India's-TeluguStop.com

హైదరాబాద్ కు చెందిన మురుగన్ అభిషేక్, ఆరవెల్లి అవినాష్ రావు( Murugan Abhishek , Aravelli Avinash Rao ) లకు అండర్-19 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో గోల్డెన్ ఛాన్స్ లభించింది.ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఆసియా కప్ లో ఆడిన అనుభవం ఉంది.

అవినాశ్ వికెట్ కీపర్ గా, అభిషేక్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా ఆసియా కప్ లో భారత్ ఆడిన మూడు మ్యాచ్లలోనూ బరి లోకి దిగారు.

అండర్-19 ఆసియా కప్ లో పాల్గొన్న భారత జట్టునే.ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.జట్టులో ఒక్క మార్పు కూడా లేకుండా ఎంపిక చేయడం విశేషం.

ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు పంజాబ్ కు చెందిన ఉదయ్ సహారన్ సారథ్యం వహించనున్నాడు.సౌమీ కుమార్ పాండే( Sowmi Kumar Pandey ) జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఇదే: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాష్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి.అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది.16 జట్ల మధ్య మొత్తం 41 మ్యాచ్లు జరుగుతాయి.భారత జట్టు జనవరి 20వ తేదీ బంగ్లాదేశ్ తో తలపడనుంది.

జనవరి 22న ఐర్లాండ్ తో, జనవరి 28న యూఎస్ఏ తో భారత్ తలపడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube