బాహుబలికి పెద్ద కష్టం వచ్చిపడింది

ఎస్ ఎస్ రాజమౌళి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ బాహుబలికి పెద్ద కష్టం వచ్చిపడింది.బాహుబలి మొదటిభాగానికి హిందీలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో, రెండొవభాగానికి అదోరకం డిమాండ్ ఏర్పడింది.

 Fast And Furious 8 To Clash With Baahubali 2 ?-TeluguStop.com

యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ 150 కోట్లు పెట్టి సినిమా హిందీ హక్కులను కొనుక్కుంటాం అంటున్నారంటే మీరే అర్థం చేసుకొండి, ఇప్పుడు బాహుబలి హిందీ ప్రేక్షకులకి ఎంతపెద్ద సినిమానో.అంతా చక్కగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో పెద్ద చిక్కే వచ్చిపడింది.

వచ్చే ఎడాది ఏప్రిల్ 14న బాహుబలి – ది కంక్లూజన్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈరకంగా అదే తేదికి బాహుబలి రావడం ఖరారైపోయింది.

ఇక వచ్చిన ప్రమాదం ఏమిటంటే, హాలివుడ్ చిత్రం ” ఫాస్ట్ ఆండ్ ఫురియస్ 8″ ని భారతదేశంలో సరిగ్గా అదే తేదినా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

హాలివుడ్ సినిమాలకు హిందీ మార్కెట్లో, దేశవ్యాప్తంగా మహానగరాల్లో ఎంత డిమాండ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.

సైలంట్ గా వచ్చిన జంగల్ బుక్, ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలన్నీటికిలోకి అతిపెద్ద హిట్ గా నిలిచింది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫాస్ట్ అండ్ ఫురియస్ 7 భారతదేశంలో 100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది.

సీరీస్ లోని గత చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది కాబట్టి, ఎనిదొవ భాగానికి మంచి గిరాకి ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఈరకంగా బాహుబలి హిందీ వెర్షన్ కి పెద్ద పోటి తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube