సినీ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ( Shivaji ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో ఈయన కూటమికి మద్దతు తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్లు సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా కూటమికి మద్దతు తెలిపినటువంటి ఈయన కూటమి అధికారంలోకి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇకపోతే తాజాగా శివాజీ తిరుమల శ్రీవారిని (Tirumala Srivaru) దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
స్వామివారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల శివాజీ కనిపించడంతో కొంతమంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎగబడ్డారు.అనంతరం శివాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు.స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని స్వామి వారి మొహం కళకళలాడుతుందని తెలిపారు.
ముందు ఇలా ఉండేది కాదని ఈయన పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.ప్రస్తుతం అంతా బాగుందని ఇకపై ఇంకా బాగుంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అమరావతి, పోలవరం ఇవి స్వామి వారి లక్ష్యాలని ఆ లక్ష్యాలను ఈసారి ఆయన నెరవేరుస్తారని శివాజీ వెల్లడించారు.ఇక కూటమి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఇకపై ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఈయన వెల్లడించారు.అంతేకాకుండా ఒకప్పుడు వైసీపీ నేతలు అందరిని ఇబ్బందులు పెట్టి ఏడిపించారు.ఇప్పుడు తిరిగి వారిని కూడా ఏడిపిస్తున్నారని కర్మ వారిని వెంటాడుతుంది అంటూ తిరుమల ఆలయంలో శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ కొందరు ఈయనకు మద్దతు తెలియజేస్తూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.