ప్రస్తుతం ఏపీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో జనసేన నాయకులు పవర్ స్టార్ అభిమానులు పవర్ స్టార్ కుటుంబ సభ్యులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు అయితే ఈ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచాడో ఇక అప్పటినుంచి కొడుకు అకీరా తండ్రి వద్దే ఉంటూ తండ్రి వెనకాలే ఉన్నారు.

కొడుకు అకీరాను పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా ప్రధాని మోదీని వీరు కలిసిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా జనసేన నాయకులు పవర్ స్టార్ అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.కాగా తాజాగా ఈ ఫోటోస్ పై రేణు దేశాయ్( Renu Desai ) ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఈ మేరకు రేణు దేశాయ్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.

నాకు మొదటి నుంచి భాజపా అంటే అభిమానం.మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది.దానిని మాటల్లో వర్ణించలేను.
మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు.ఆయన చాలా గొప్ప వ్యక్తి అని.తన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అని రాసుకొచ్చింది రేణు దేశాయ్.కాగా తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు.
తన కుమారుడు అకీరాను సైతం దిల్లీకి తీసుకెళ్లారు.కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు.
ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.








