యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి 164 సీట్లు గెలుపొంది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమా సెలబ్రిటీలు మొత్తం సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ, తన అత్తయ్య పురందేశ్వరి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఎంపీగా గెలిచిన భరత్ కి కూడా అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ విధంగా ఎన్టీఆర్ కూటమి విజయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్టుపై చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు.ఈ క్రమంలోనే బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్( Sree Bharath ) వైజాగ్ ఎంపీగా గెలుపొందారు.ఇలా తన గెలుపుకు శుభాకాంక్షలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్టీఆర్ కి రిప్లై రావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక భరత్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్టీఆర్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ తారక్ అన్న, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమంతా కృత నిశ్చయంతో ఉన్నాం.దేవర (Devara) సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇందులో తారక్ అన్న అంటూ సంబోధించడంతో కచ్చితంగా ఈ ట్వీట్ భరత్ కాకుండా ఆయన భార్య, బాలయ్య ( Balayya ) చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini) చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఒకవేళ భరత్ కనుక చేసి ఉంటే ఎన్టీఆర్ ని బావ అని పిలిచేవారు కదా అంటూ అభిమానులు భావిస్తున్నారు.ఏది ఏమైనా తారక్ ను అన్నా అంటూ పిలవడంతో ఈ అన్న చెల్లెల మధ్య అనుబంధం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.