నందమూరి దివంగత హీరో హరికృష్ణ( Harikrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరికృష్ణ.
ఈయన ముక్కుసూటి వ్యక్తి అన్న విషయం మనందరికీ తెలిసిందే.తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించేవారు.
అలాగే తనకు చేతనైన సహాయం చేస్తుంటారు.సహాయం చేసిన వారిని మరచిపోరు.

ఇక హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram) నటించిన ఇజం చిత్రం సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజం చిత్రం తెరకెక్కింది.ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ లో హరికృష్ణ పూరి జగన్నాధ్ సతీమణి లావణ్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన వాక్యాలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సూచన మీడియాలో వైరల్ గా మారింది.ఒక సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు.ఆఫీస్ బాయ్ కూడా ఒక చిత్రానికి చాలా ఉపయోగపడతారు.

ఆఫీస్ బాయ్ ఇచ్చేమంచి టీతో మన ఎనేర్జి పెరుగుతుంది.డ్రైవర్ మనల్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు.నేను మా నాన్న గారికి డ్రైవర్ గా రథ సారధిగా పనిచేశాను.
ఇజం చిత్రం జరుగుతున్న సమయంలో నేను పూరి జగన్నాధ్ గారి ఇంటికి ఒకసారి వెళ్ళాను.ఆయన సతీమణి లావణ్య నాకు నమస్కరించి చాలా ఆప్యాయంగా పలకరించారు.ఏం తీసుకుంటారు సార్ అని అడిగారు.కాఫీ తీసుకుంటాను అమ్మా అని చెప్పాను.
ఎంతో అద్భుతమైన కాఫీ ఆమె నాకు ఇచ్చారు.నేను జీవితంలో మరచిపోలేను అని తెలిపారు హరికృష్ణ.
పక్కనే ఉన్న పూరి జగన్నాధ్ కాఫీ ఇచ్చినందుకు కూడా ఇంతలా పొగడలా అన్నట్లుగానా వైపు చూశారు.దీనితో హరికృష్ణ నేను ఆమెకి కృతజ్ఞత చెప్పుకోవాలి.
నేను నా మనసులో అనిపించింది చెప్పేస్తాను.దాచుకొను.
దాచలేను అని తెలిపారు.