వర్షం తర్వాత ప్రభాస్ కి ఆ సినిమా పాటలు అంటే అంత ఇష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు .ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 This Is Prabhas Favourite Music Album After Varsham Movie , Prabhas, Varsham, Mi-TeluguStop.com

త్వరలోనే ప్రభాస్ కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫేవరెట్ సాంగ్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఎంతో అద్భుతమైన సంగీత దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈయన సినిమాలోని పాటలు అంటే ఎప్పటికీ కొత్త ట్రెండ్ అనేలాగే ఉంటాయని చెప్పాలి.ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన వర్షం( Varsham ) సినిమాలోని పాటలంటే తనకు చాలా ఇష్టమని ప్రభాస్ తెలిపారు.

ఇక ఈ సినిమాలోని పాటలు తన ఆల్ టైం ఫేవరెట్ ఆల్బమ్ అంటూ ప్రభాస్ వెల్లడించారు.

దేవిశ్రీ మ్యూజిక్ అలాగే పాటలలోని రీ సౌండ్ తనకు చాలా బాగా నచ్చుతుందని తెలిపారు.ఈ సినిమా తర్వాత తనకు జల్సా ( Jalsa ) సినిమాలోని పాటలు అంటే కూడా చాలా ఇష్టమని ప్రభాస్ తెలిపారు.ఇక దేవిశ్రీ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ మిర్చి ( Mirchi ).ఈ సినిమా కూడా ఇలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమాలో పండగలాదిగివచ్చావే అనే పాట మొదటిసారి వినగానే చాలా బాగా నచ్చింది.

ఈ పాటను ఒక 150 సార్లు  విని ఉంటాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube