“నాన్నకు ప్రేమతో.సుకుమార్ తీసిన టెర్రిఫిక్ – బ్యూటిఫుల్ మూవీ.
తారక్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకుతుంది” అని చెబుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్.
తన సినిమాలకి తాను సైలెంట్ గా మ్యూజిక్ చేసుకుని వెళ్ళిపోయే దేవీ శ్రీ ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో మాత్రం పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాడు.ఎప్పుడూ ఏ సినిమా గురించి ఎక్కడా మాట్లాడని దేవీ ఈ సినిమా కోసం తెగ ప్రచారం చేస్తున్నాడు.
ఇదేదో కొత్తగా ఉన్న విశేషం.
అతని చేస్తున్న పోస్ట్ లూ, అతను చెబుతున్న కబుర్లూ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
కొన్ని రోజుల కిందటే రీరికార్డింగ్ పూర్తి చేసిన దేవి.ఆ ఎక్స్జపీరియన్స్ తో సినిమా ‘టెర్రిఫిక్’ అని చెప్పడం వారిలో ఆనందం కలిగిస్తోంది.
ఇలా మైండ్ బ్లోయింగ్, హార్ట్ టచింగ్ లాంటి పదాలు పెడుతూ సినిమా ప్రేక్షకులలో కూడా ఒక రకమైన హైప్ ని పెంచేస్తున్నాడు.తన తండ్రి చనిపోయిన సమయంలో రాబోతున్న సినిమా అందులోనూ నాన్న సెంటిమెంట్ కాబట్టి ఈ సినిమా కి బాగా కనక్ట్ అయ్యాడు అంటున్నారు.