మళ్లీ చెలరేగిన ఉస్మానియా విద్యార్థులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు.ఆయన నిర్ణయాలపై మండిపడుతుంటారు.

 Osmania Students Stage Protest Against Ts Govt-TeluguStop.com

గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని ఆయన ప్రకటించినప్పుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.ఇప్పుడు ఆయన ప్రకటించిన మరో నిర్ణయంపై పోరాటానికి దిగారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పదకొండు ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానని ఆయన ప్రకటించిన వెంటనే విద్యార్థులు ‘ఇది నీ అబ్బ సొత్తా?’ అని ప్రశ్నించారు.ఒక్క అంగుళం కూడా వదిలేది లేదని ప్రతిన బూనారు.

సోమవారం నుంచే పోరాటం ప్రారంభించారు.ఇప్పుడు భూములను తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెబుతున్న కేసీఆర్‌ తరువాత కాలంలో ఉస్మానియా భవనాలను కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తారని విమర్శించారు.

విద్యార్థులు సచివాలయంలోని సి బ్లాక్‌ దగ్గర ఆందోళన చేశారు.అడ్డగించిన పోలీసులతో తలపడ్డారు.

ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహానికి తలొగ్గి కేసీఆర్‌ తన నిర్ణయం మార్చుకుంటారా? లేదా మొండిగా వ్యవహరిస్తారా? కేసీఆర్‌ మొండితనానికి దిగితే విద్యార్థులు రణరంగం సృష్టించడం ఖాయం.వారు కేసీఆర్‌తో తాడో పేడో తేల్చుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube