ఈ నెల 9 నుంచి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం!

కార్తీక మాసంలో ప్రతి ఏడాది హైదరాబాదులో భక్తి టీవీ, ఎన్టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని( Bhakti TV, NTV Koti Deepotsava program ) నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.

 Koti Deepotsavam Will Be Held In Full Splendor From The 9th Of This Month!, Koti-TeluguStop.com

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తి టీవీ,ఎన్టీవీ కలిసి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.అందుకు సమయం కూడా ఆసన్నమైంది.

ఈ నేపథ్యంలోనే భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్తంగా కార్తీక కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు.

Telugu Bhakti Tv, Full Splendor, Jagadgurubharti, Kotideepotsavam, Ntvkoti-Telug

అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతూ వస్తున్న ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు.ప్రతి ఏడాది జరిగే లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు.ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య ఘట్టం ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యాన్ని నిజంగా మాటల్లో వర్ణించలేమని చెప్పాలి.

Telugu Bhakti Tv, Full Splendor, Jagadgurubharti, Kotideepotsavam, Ntvkoti-Telug

మన సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2012 నుంచి భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది.అయితే అందులో భాగంగానే ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 9 న ప్రారంభమై నవంబర్ 25 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.అలాగే దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, హైందవ సమాజ సేవకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube