ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ సమంత పేరు కూడా ఒకటి.మొన్నటి వరకు సమంత (samantha)పేరు తక్కువగా వినిపించగా ఇప్పుడు పలు రకాల విషయాలలో సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రస్తుతం సమంత పేరు నెట్టింట్లో టాప్ లో ట్రెండ్ అవుతోందని చెప్పాలి.తాజాగా సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్‌లోకి (Samantha Citadel web series into prime)వచ్చింది.
ఇప్పటికే స్ట్రీమింగ్ కూడా ప్రారంభమైంది.ఇక సమంత, వరుణ్ ధావన్ (Samantha ,Varun Dhawan)కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
మరోసారి రాజ్ అండ్ డీకే (Raj and DK)తమ రైటింగ్ టాలెంట్ చూపించినట్టుగా కనిపిస్తోంది.ఇక ఇందులో ఫర్జీని కూడా లింక్ చేసిన్టటుగా, అది అద్భుతంగా కుదిరిందని నెటిజన్లు అంటున్నారు.కాగా ఈ సిరీస్ లో సమంత పెట్టిన లిప్ లాక్ సీన్లకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.సమంత రెచ్చిపోయి మరీ బోల్డ్(bold) సీన్లలో నటించిందని అంటున్నారు.
ఫ్యామిలీ మెన్ సీజన్ 2(Family Men Season 2)లో సమంత బోల్డ్ సీన్లకు అంతా ఫైర్ అయ్యారు.అసలు ఈ సిరీస్ వల్లే చై, సామ్ మధ్య గొడవలు వచ్చాయని కూడా అన్నారు.
ఇక ఇప్పుడు సమంత అంతకు మించి అనేలా సిటాడెల్ లో కనిపిస్తోంది.
మరి దీనికి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.మరి సిటాడెల్ లో సమంతా లిప్ లాక్ సన్నివేశాలపై వస్తున్న కామెంట్స్ పై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.