ముసలాయనపై అడవి పంది అటాక్‌.. ఒళ్లు గగుర్పొడిపించే వీడియో వైరల్..

అడవి పందులు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి.ఎవరైనా కనిపిస్తే చాలు వారిని దారుణంగా గాయపరిచే దాకా అవి వదలవు.

 A Wild Boar Attack On An Old Man The Shocking Video Has Gone Viral, Viral Video,-TeluguStop.com

అడవి పందులు(wild boar) ఇప్పటిదాకా ఎంతోమంది మనుషులను చంపేస్తాయి కూడా.వీటి దాడులకు సంబంధించిన వీడియోలు అడపా దడపా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి.

వాటిని చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు.తాజాగా అలాంటి భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు తిరుగుతోంది.

ఈ వీడియోలో, ఒక ముసలాయన(old man) రోడ్డు మీద వెళ్తుండగా, ఒక అడవి పంది అతనిపై దాడి చేసింది.చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు ఆ పందిని ఆపాలని ప్రయత్నించినా, అది వెనక్కి తగ్గలేదు.

“americasgoneviral” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఈ భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అందులో, ఒక ఒక పెద్దాయనపై ఒక అడవి పంది ఎంతో క్రూరంగా దాడి చేస్తుంది.ఆ పెద్దాయన కూడా నందిని తన కాళ్లతో తన్నుతూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు.కానీ ఆ పంది చాలా బలంగా ఉంది అది అతడిని కొరికేస్తూ బాగా గాయపరిచింది.

వ్యక్తి ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆ పంది పైన గట్టిగా కొట్టాడు.అయినా సరే అది కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు సరి కదా దాని ఎటాక్ ను మరింత తీవ్రం చేసింది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియదు కానీ, ఈ వీడియో చూసి ప్రపంచం మొత్తం భయపడిపోయింది.

కొద్ది రోజుల క్రితం ఈ వీడియో పెట్టిన తర్వాత, 57 వేల మందికి పైగా లైక్ చేశారు.చాలా మంది ఈ వీడియో కింద కామెంట్లు చేస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఒకరు “ఏడుగురు మగాళ్లు కూడా దాన్ని ఆపలేకపోయారు” అని రాస్తే, మరొకరు “ఆ వృద్ధుడు చాలా గాయపడి ఉంటాడు” అని రాశారు.

మరొకరు “ఆ పంది ఆ పరిసరాలనే ధ్వంసం చేసింది” అని రాస్తే, మరొకరు “ఒక జంతువు ఒకదాన్ని లక్ష్యంగా చేసుకుంటే దాన్ని ఏం చేసినా వదలదు” అని రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube