వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడినా ఎన్ఆర్ఐల( NRI ) మనసంతా మాతృభూమిపైనే ఉంటుంది.నిత్యం ఇక్కడేం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉంటారు.
వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా స్వదేశానికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుస్తుంటారు.అనేక దేశాల్లో భారతీయులు రాజకీయ నేతలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏకంగా అమెరికా అధ్యక్ష పీఠంపై భారత మూలాలున్న కమలా హారిస్ కన్నేశారు.
అలా విదేశాల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటుతుంటే.ఓ ఎన్ఆర్ఐ మహిళ మాత్రం స్వదేశంలో సర్పంచ్‌గా( Sarpanch ) పోటీ చేస్తోంది.పంజాబ్‌లోని( Punjab ) భోగ్‌పూర్ సమీపంలోని బుత్రా గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ గ్రామానికే చెందిన 70 ఏళ్ల హర్భజన్ కౌర్.( Harbhajan Kaur ) కెనడా పౌరురాలు.
అయితే స్వగ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలని హర్భజన్ నిర్ణయించి, అనుకున్నదే తడవుగా ఇండియా వచ్చేశారు.పంచాయతీ ఎన్నికలకు( Panchayat Elections ) ఇంకా మరికొన్ని రోజులే ఉండటంతో ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
హర్భజన్ 1970లలో తన తల్లిదండ్రులతో కలిసి కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
కెనడాలో( Canada ) ఉంటున్నా నేను నా మూలాలను మరిచిపోనని హర్భజన్ అంటున్నారు.ప్రతిరోజూ ఉదయాన్నే తన ప్రచారం ప్రారంభించి గ్రామస్థులను ఓట్లు అభ్యర్ధిస్తున్నట్లుగా ఆమె తెలిపారు.గ్రామంలో మొత్తం 1200 ఓట్లు ఉన్నాయి.
విద్య, ఆరోగ్యం, క్రీడలు సహా తమ గ్రామస్తులకు మెరుగైన సదుపాయాలు అందించాలని కోరుకుంటున్నట్లు హర్భజన్ తెలిపారు.తాను సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఇక్కడే నివాసం ఉంటానిన ఆమె స్పష్టం చేశారు.
గ్రామంలో ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాల లేదని.ఇక్కడి యువకులు క్రీడల్లో తమ శక్తిని వినియోగించేలా, మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు నా వంతు కృషి చేస్తానని హర్భజన్ హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆమె ఎన్నికల్లో పోటీ చేయడాన్ని పంజాబ్ వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.