సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా, చెల్లిగా, ఇతర పాత్రల్లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయనకు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Know This Telugu Actress Who Played Mother Wife And Lover Role With Rajinikanth,-TeluguStop.com

దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా రజనీకాంత్ కి బాగానే అభిమానులు ఉన్నారు.ఆయన సినిమా కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక తలైవా సినిమా విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది.తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు ఒక రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

73 ఏళ్ల చిన్న వయసులో కూడా రజనీకాంత్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Telugu Bollywood, Mother Role, Rajinikanth, Sridevi, Tollywood, Role-Movie

సీనియర్ హీరోయిన్స్ కాకుండా కుర్ర హీరోయిన్స్ కూడా ఈ స్టార్ హీరో తో జత కడుతున్నారు.రజనీ సినిమా విడుదలైతే సూపర్ స్టార్ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.అలాగే రజనీ కొత్త సినిమా విడుదలైనప్పుడు తమిళనాడు( Tamil Nadu )లోని పలు సంస్థలు సెలవులు ప్రకటించాయి అంటే అక్కడ తలైవాకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కంపెనీలు ఉద్యోగుల కోసం టిక్కెట్లు బుక్ చేసి సినిమాలు చూసేందుకు ఆఫర్ చేస్తాయి.అలాంటి సర్ ప్రైజ్ రజనీకాంత్ విషయంలోనే జరుగుతుందని చాలాసార్లు విన్నాము.70 ఏళ్లు దా
టిన ఒక కథానాయకుడు సినిమాకు 200 కోట్లు పారితోషికం తీసుకోవడం చిన్న విషయం కాదని చెప్పాలి.రజినీకాంత్ తో ఇప్పటివరకు చాలామంది నటీనటులు నటించారు.

Telugu Bollywood, Mother Role, Rajinikanth, Sridevi, Tollywood, Role-Movie

కానీ రజనీకాంత్ తల్లిగా, ప్రేయసిగా, భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఉన్నారు? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి( Sridevi ).అవును శ్రీదేవి కూడా ఒక సినిమాలో రజనీకాంత్ తల్లిగా నటించింది.నటి శ్రీదేవి 13 ఏళ్ల వయసులో రజనీకాంత్ తల్లి పాత్రలో నటించారు.1976లో వచ్చిన మండ్రు ముడిచు చిత్రంలో రజనీకాంత్ తల్లిగా నటించింది.అంతేకాదు శ్రీదేవికి ఇదే మొదటి సినిమా.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ లో దాదాపుగా 22 సినిమాలు వచ్చాయి.నటి శ్రీదేవి చాలా సినిమాల్లో రజనీకాంత్ భార్యగా, ప్రియురాలిగా నటించారు.రజనీకాంత్‌ తో ఆమె తల్లిగా, భార్యగా, ప్రేమికుడిగా, చెల్లెలుగా నటించినట్లు సమాచారం.

ఇక శ్రీదేవి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube