అయినా పీకే ను వద్దనుకుంటున్న జగన్ ..?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా 151 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో సీట్లను సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తూ ఎన్నికలకు వెళ్లినా,  అక్కడ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి .కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం కావడం,  ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది.

 Ys Jagan Mohan Reddy Doesn T Want Prasanth Kishor, , Pk, Ap Politics, Ap Gover-TeluguStop.com

పార్టీలోని కీలక నాయకులు ఎంతో మంది ఇతర పార్టీలలో చేరిపోయారు.ప్రజలతో పార్టీకి దూరం పెరగడమే జగన్ ఓటమికి కారణంగా అనేక విశ్లేషణలు వచ్చాయి.ఆ తర్వాత నుంచి జగన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, అప్పుడప్పుడు జనాల్లో కి వచ్చి టిడిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు .2029 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలనే పట్టుదలతో జగన్( YS Jagan Mohan Reddy) ఉన్నారు.

Telugu Ap, Ipack, Jagan, Telugudesam, Ysjagan-Politics

ఈ నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయ వ్యవహకర్త , ఐ ప్యాక్ టీం అధినేత ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishor)వ్యవహారం చర్చనియమించంగా మారింది.ఎన్నికలకు ముందు వైసీపీ కి గెలుపు అవకాశాలు లేవని మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం , ఆయన టిడిపి తో కలిసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇవ్వడం వంటివి జరిగాయి.  అయితే జగన్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులు చేస్తున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతుంది.

Telugu Ap, Ipack, Jagan, Telugudesam, Ysjagan-Politics

ప్రస్తుతం జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా బెంగళూరులో విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు.ఈ సమయంలోనే జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ( YCP) కోసం పని చేయాలనే సూచన వచ్చిందట.  ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించగా ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేసేందుకు జగన్ ఆసక్తి చూపించలేదట.

నేరుగా జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేసినా,  ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube