అదేంటి నిర్మాత లేకుండా సినిమా ఎలా తీస్తారు అనే కదా మీకు డౌట్.ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ హీరోలు అందరికీ అసలు నిర్మాతలతో పని లేదు.
ఎందుకంటే తమ సినిమాలకు వేరే ప్రొడ్యూసర్స్ ని వెతుక్కునే అవసరం లేదు.తమకే సొంతంగా బ్యానర్స్ ఉన్నాయి.
అలాగే గత కొన్ని ఏళ్లు గా తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు.అలా సొంత బ్యానర్స్ పై సినిమాలో నిర్మించుకుంటూ తామే హీరోలుగా నటించడం వల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా వారికే ఉంటుంది అలాగే లాభాలు వచ్చినా కూడా సదరు హీరోలే లాభపడతారు.
అందుకే చాలా తెలివిగా కొంతమంది హీరోలు సొంత బ్యానర్స్ ని డిస్ట్రిబ్యూషన్ ఆ రంగాన్ని ఏలుతున్నారు.మరి ఆ స్టార్ హీరోలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నితిన్
నితిన్( Nithiin ) ప్రస్తుతం టాలీవుడ్ లో టైప్ 2 హీరోగా బాగానే చలామణి అవుతున్నాడు.నితిన్ విడుదల చేసిన గత మూడు సినిమాలకు తన తండ్రి సుధాకర్ రెడ్డి అలాగే సోదరి నిఖితారెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.ఇప్పుడు తాను తీయబోతున్న మరో రెండు సినిమాలకు కూడా తన సొంత బ్యానర్ లోనే నిర్మించబోతున్నారు.ఇలా మరొక ప్రొడ్యూసర్ కి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా సొంత సంస్థకే పని చేస్తున్నాడు.ఇక డిస్ట్రిబ్యూషన్ కూడా వీరు చేయడం విశేషం.
మంచు ఫ్యామిలీ మూవీస్
మంచు ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా ఎవరు సినిమా తీసిన తమ సొంత బ్యానర్ పైనే తీయడం విశేషం వీరికి బయట ప్రొడ్యూసర్స్ తో అస్సలు పనిలేదు ఓవైపు మంచు విష్ణు( Manchu Vishnu ) మరోవైపు మంచు మనోజ్ లేదంటే మంచు లక్ష్మి తో సహా అందరు సొంత బ్యానర్ పైన పనిచేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas )సైతం తన తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రొడక్షన్ హౌస్ లోనే హీరోగా లాంచ్ అయ్యాడు.ఇతడు ఏ సినిమా చేసిన తండ్రి సురేష్ ఎన్ని కోట్లయినా పెడతాడు కాబట్టి ఇంకా హీరో అవ్వాలని తాపత్రయంతో సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
సందీప్ రెడ్డి వంగ
సందీప్ రెడ్డివంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు తన సొంత అన్నయ్య నే నిర్మాత గా ఉన్నారు.అందుకే మరొక ప్రొడ్యూసర్ నీ వెతుక్కునే పని ఆయనకు లేదు.ఇప్పటి వరకు సందీప్ తీసిన మూడు సినిమాలకు వారే నిర్మాతలు.
లెజెండ్ శరవణన్
లెజెండ్ శరవణన్ ( Legend Saravanan )తీసే ప్రతి సినిమాకి మరొక ప్రొడ్యూసర్ తో పనిలేదు ఎన్ని కోట్లయినా తానే పెట్టుకోగల కెపాసిటీ ఉన్న బిజినెస్ మాన్.సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఈ మధ్య హీరోగా కూడా మారారు.అందుకే వేరే ప్రొడ్యూసర్ కి నష్టం చేయడం ఇష్టం లేక తానే సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు.