రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలోని మార్కండేయ ఆలయ 66వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఆలయ అర్చకుడు ఉమాశంకర్ ఆధ్వర్యంలోస్వస్తి పుణ్యాహవాచనము,గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహారాధన, -అష్టదిక్పాలకులపూజ, వరుణ కలశ పూజ, -స్వామివారికి మహా రుద్రాభిషేకం, రుద్ర హవనం-హోమం పూర్ణాహుతి, ఆశీర్వచనము తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపించారు.
ఎంపీపీ రేణుక, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎంపీడీవో సత్తయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పద్మశాలి సేవా సంఘానికి రూ.35 వేల విలువైన కుర్చీలను అందజేసిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి- లహరి దంపతులను సంఘం సభ్యులు శాలువా ,జ్ఞాపకతో ఘనంగా సన్మానించారు.ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వృద్ధుల డేకర్ సెంటర్ లో వృద్ధులకు భోజనం సమకూర్చారు.
అనంతరం అన్నదానం చేశారు.కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాపల్లి దేవాంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షుడు శ్రీరాం సుదర్శన్, కోశాధికారి వనం రాజు, సంయుక్త కార్యదర్శి రాపల్లి అంబదాస్, యువజన సంఘం అధ్యక్షుడు సుంకి భాస్కర్, సోషల్ మీడియా కన్వీనర్ దోమల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుంకి విష్ణు, ఉపాధ్యక్షుడు గోస్కే శ్రీనివాస్, నాయకులు వనం ఎల్లయ్య, వనం బొందయ్య, గుల్లపల్లి మహేష్ ఆడేపు గంగారం మ్యాన నాగభూషణం, రవి తదితరులు పాల్గొన్నారు.