కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై బీజేపీ నేత ఈటల రాజేందర్( Etela Rajender ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్ హామీ తప్ప మిగిలినవి అమలు చేయలేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.పట్టభద్రులకు డబ్బుల ఆశ చూపించి ఓటు వేయించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపణలు చేశారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం మనుగడలో లేని పార్టీ బీఆర్ఎస్ అని ఆయన విమర్శించారు.ఈ క్రమంలో నిరుద్యోగులు, పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని ఈటల సూచించారు.
అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి( Gujjula Premender Reddy )ని గెలిపించాలని కోరారు.