భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections )ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఏడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే పలు విడతలు ముగిశాయి.
కోట్లాది మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇదిలావుండగా.
స్వదేశంలో ఎన్నికల పండుగలో భాగం పంచుకోవాలని ప్రవాస భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారు.ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు .తాజాగా జర్మనీలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ జంట సోమవారం జరుగుతున్న ఐదో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చేరుకున్నారు.

మ్యూనిచ్‌లో నివసిస్తున్న మణిప్రకాష్ , అతని భార్య సుప్రియా శ్రీవాస్తవ( Mani Prakash , Supriya Srivastava ) దాదాపు పదేళ్ల తర్వాత ఓటు వేయడానికి ముజఫర్‌పూర్‌లోని బైరియా( Bairia )లోని తమ స్వగ్రామానికి చేరుకున్నారు.పోలింగ్ రోజున గడప దాటని వారిని, సెలవు దొరికింది కదా అని బాధ్యత మరిచి తిరుగుతున్న వారికి ఈ జంట ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.బైరియా చేరుకున్న వారికి బంధువులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు.
చాలామంది ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడుతుంటే వీరు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం పెద్ద విషయమన్నారు.

సుప్రియ తండ్రి బీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .గతంలో తన కుమార్తె బ్రహ్మపురలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేదని, పెళ్లి తర్వాత భర్తతో కలిసి జర్మనీ వెళ్లిందని తెలిపారు.ఈ ఏడాది ఓటు వేసేందుకు మాత్రమే భారత్‌కు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మణిప్రకాష్ జర్మనీలో బీహార్ అండ్ జార్ఖండ్ ఫ్రంటెర్నిటీ మ్యూనిచ్ సంస్థను నడుపుతున్నారు.ఈ సంస్థ బీహార్ , జార్ఖండ్ ప్రజలకు వారధిగా పనిచేస్తుంది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం మన బాధ్యత అని , దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలని సుప్రియ పిలుపునిచ్చారు.మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు.
ఇకపోతే.ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానంలో( Muzzaffarpur) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.
అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా రాజభూషణ్ నిసాద్, కాంగ్రెస్ తరపున అజయ్ నిషాద్ బరిలో నిలిచారు.







