ప్రపంచంలో ఏ విషయం జరిగిన ఆ విషయం క్షణాల వ్యవధిలో ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా అందరికీ తెలిసిపోతుంది.రోజురోజుకి కాలం మారిపోతున్న తరుణంలో టెక్నాలజీ కూడా కొత్త రూపాంతరం చెందుకుంటూ మానవుల జీవితాలలో మమేకమైపోయింది.
ప్రస్తుతం అంత ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మీద ఆధారపడి ప్రపంచం ముందుకు వెళ్తుంది.అనేక పనులలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకోకుండా పని జరగట్లేదు.
ముఖ్యంగా వీటిని ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే కచ్చితంగా పనులను పూర్తి చేసుకోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ( Artificial Intelligence ) సహాయంతో రకరకాల ఫోటోలను అద్భుతంగా సృష్టించడం జరుగుతుంది.ఇదివరకు కొంతమంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా 60 ఏళ్లకు పైబడి ఉన్న వివిధ దేశాల నేతలు అందరిని ఏఐ టెక్నాలజీ( AI Technology ) సహాయంతో వారిని చిన్న పిల్లలుగా మార్చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ప్రస్తుతం అధినేతలు చిన్నపిల్లలుగా మార్చి వారిని ముద్దుగా ఉండేలా ఫోటోలను రూపొందించారు కొందరు.ఇక ఇందుకు సంబంధించి ఓ వీడియో ని కూడా విడుదల చేశారు.ఇక ఈ వీడియోలో.
ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) రష్యా అధ్యక్షుడు పుతిన్,( Putin ) జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ ఇలా చాలామంది దేశాధినేతల ఫోటోలను చిన్నపిల్లలగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియోకి ‘Asking AI To Draw World Leaders As Babies’ అనే క్యాప్షన్ ను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిజానికి చూడడానికి ఫోటోలు తెగ ఆకట్టుకోవడంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు వారి అభిమాన నాయకుడి ఫోటో చూసి మురిసిపోతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మన దేశాధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా ఉన్నారో ఓ లుక్ వేయండి.