వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిల్..!

ఏపీలో వాలంటీర్ల రాజీనామాలను( Volunteers Resignations ) ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సీనియర్ న్యాయవాది ఉమేశ్ చంద్ర( Senior Advocate Umesh Chandra ) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

 Pil In Ap High Court On The Issue Of Resignation Of Volunteers Details, Ap High-TeluguStop.com

వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికల క్యాంపెయిన్ తో పాటు పోలింగ్ ఏజెంట్లుగా( Polling Agents ) పని చేసే అవకాశం ఉందని లాయర్ ఉమేశ్ చంద్ర పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని వెల్లడించింది.

అయితే ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube