మధ్యతరగతి బడ్జెట్లో తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నుబియా గ్లోబల్ మార్కెట్ లో నుబియా ఫ్లిప్( Nubia Flip 5G ) పేరుతో ఫోల్డబుల్ 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.గ్లోబల్ మార్కెట్ లో అత్యంత తక్కువ బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే.ఈ ఫోన్ ఫీచర్ లతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.

 This Is The First Foldable Phone In The Middle Class Budget What Are The Featur-TeluguStop.com

నుబియా ఫ్లిప్ 5G ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 6.9 అంగుళాల OLED డిస్ ప్లే( OLED display ) తో ఉంటుంది.1188*2790 పిక్సెల్ రిజల్యూషన్ స్క్రీన్ తో ఉంటుంది.క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7జెన్ 1 చిప్ సెట్ ప్రాసెసర్ తో వస్తుంది.4310 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ సర్క్యూలర్ కెమెరా మోడల్( Circular camera model ) తో వస్తుంది.50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.5G, వైఫై, బ్లూటూత్ 5.2, NS కనెక్టివిటీ లాంటి ఫీచర్ లతో ఉంటుంది.

ఈ ఫోల్డబుల్ మాట ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+ 256GB వేరియంట్ ధర రూ.34500 గా ఉంది.12GB RAM+ 256GB వేరియంట్ ధర రూ.38000 గా ఉంది.12GB RAM+ 512GB వేరియంట్ ధర రూ.42600 గా ఉంది.నుబియా ఫ్లిప్ 5G ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.కానీ గ్లోబల్ మార్కెట్ లో తక్కువ బడ్జెట్ లో వచ్చే తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube