ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.
ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ తమదైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి.ఇక మరోవైపు సర్వేలు సైతం జోరుగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించగా.తాజాగా వెలుగులోకి వచ్చిన మరో సర్వే సంచలనంగా మారింది.
ఈ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైసీపీ( YCP )నే అధికారంలోకి వస్తుందని స్పష్టం అవుతోంది.అభ్యర్థుల జాబితా, ప్రచారం, నేతలకు ప్రజల్లో ఉన్న జనాదరణ వంటి పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వేను చేపడుతున్నాయి ఆ సంస్థలు.
ఈ క్రమంలోనే జన్ మత్, లోక్ పోల్, ఆత్మసాక్షి వంటి పలు సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడించాయి.ఈ నేపథ్యంలో నాగన్న సర్వే బయటకు వచ్చింది.
నాగన్న సర్వే( Naganna Survey ) పేరిట థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సుమారు 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించారు.ఒక్కో నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల మంది చొప్పున 157 స్థానాల్లో సర్వే చేపట్టారు.దీని ప్రకారం ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయఢంకా మోగించనుంది.నాగన్న సర్వే ప్రకారం దాదాపు 103 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది.అలాగే టీడీపీ -జనసేన మరియు బీజేపీ కూటమికి 39 స్థానాలు దక్కుతాయని సర్వేలో వెల్లడైంది.అదేవిధంగా మిగిలిన 33 సీట్లలో వైసీపీ, కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉండనుందని.
ఈ క్రమంలో ఇక్కడ కూడా సుమారు 20 నుంచి 25 సీట్లు వైసీపీనే కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని నాగన్న సర్వే తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి 49 నుంచి 51 ఓట్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 45 నుంచి 46 శాతం, కాంగ్రెస్ కు 0.8 నుంచి ఒక శాతం ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉందని నాగన్న సర్వేలో తేలింది.అదేవిధంగా లోక్ సభ నియోజకవర్గ స్థానాల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీనే విజయాన్ని కైవసం చేసుకోనుంది.కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందే ఛాన్స్ ఉందని సర్వే అంచనా వేసింది.
కాగా వైసీపీకి క్యాడర్ బలంగా ఉండటంతో పాటు మహిళల మొగ్గు కూడా బలంగా చెప్పుకోవచ్చు.వాలంటీర్లు, పెన్షనర్ల మద్ధతుతో పాటు యువతలో జగన్( YS Jagan Mohan Reddy ) పై క్రేజ్ ఎక్కువగా ఉండటం మరియు గత మ్యానిఫెస్టోను దాదాపు పూర్తిగా అమలు చేయడం వంటివి వైసీపీ విజయానికి కలిసొచ్చే అవకాశం ఉంది.అలాగే కూటమి అభ్యర్థులో అసంతృప్తులు, నేతల తీరుపై ఉన్న వ్యతిరేకత బయటకు రావడం, జనసేన 21 సీట్లకు మాత్రమే పరిమితం కావడంపై పవన్ పై పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తి వంటివి కూటమి గెలుపును అడ్డుకునే అంశాలుగా మారుతున్నాయని తెలుస్తోంది.అయితే మొత్తంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం కొనసాగడం తథ్యమని నాగన్న సర్వే వెల్లడించింది.