యూకేలో పరుపులు, కేక్ ఫ్యాక్టరీలపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారనే అనుమానంతో 12 మంది భారతీయులను( Indians ) అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ వున్నారు.యూకే హోం ఆఫీస్ బుధవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం.
ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్( West Midlands in England ) ప్రాంతంలో పరుపులు తయారుచేసే ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించారు.ఈ సందర్బంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారని.
వీరంతా చట్టవిరుద్ధంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారని హోం ఆఫీస్ తెలిపింది.

ఈ ప్రాంతానికి సమీపంలోని ఓ కేక్ ఫ్యాక్టరీలో మరో నలుగురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు.వీరు తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఒకరు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు యూకే హోం ఆఫీస్( UK Home Office ) తెలిపింది.మరో భారతీయ మహిళను ఇమ్మిగ్రేషన్ నేరంపై ఓ ఇంటిలో అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం మరిన్ని దాడులు చేయాలని ప్రణాళిక లు రూపొందించినట్లు చెప్పారు.

అరెస్ట్ అయిన వారిలో నలుగురు భారతీయులను యూకే నుంచి బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.మిగిలిన 8 మంది హోం ఆఫీస్‌కు ఎదుట క్రమం తప్పకుండా హాజరయ్యే షరతుపై బెయిల్ పొందినట్లుగా వెల్లడించింది.దాడులు జరిపిన రెండు ఫ్యాక్టరీలు తమ కర్మాగారాల్లో చట్టవిరుద్ధంగా కార్మికలును నియమించుకున్నట్లుగా దర్యాప్తులో తేలంది.
ఈ సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం వుంది.తాము దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నామనే దానికి ఈ ఆపరేషన్ స్పష్టమైన ఉదాహరణ అని మంత్రి మైఖేల్ టాంలిన్సన్( Minister Michael Tomlinson ) అన్నారు.
నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన యజమానులపై భారీ జరిమానా విధిస్తామని, అలాగే కార్మికులకు ఇక్కడ నివసించడే హక్కు లేదని తేలితే వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు
.