ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అహర్నిశలు కష్టపడుతూ తమదైన రీతిలో వరుస సినిమాలు రూపొందించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది…ఇక యంగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నితిన్( Nitin ) లాంటి స్టార్ హీరో కూడా ప్రస్తుతం సక్సెస్ పరంగా వెనకబడిపోతున్నాడని చెప్పాలి.
ఇక భీష్మ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్న నితిన్ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.ఇక దానికి కారణం ఏంటి అంటే ఆయన ఎంచుకునే కథల్లో దమ్ము లేకపోవడమే అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.మరి ఇలాంటి క్రమంలో వెంకీ కుడుముల( Venky Kudumula ) లాంటి స్టార్ డైరెక్టర్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు.
అలాగే వేణు శ్రీరామ్ ( Venu Sriram )లాంటి మరొక డైరెక్టర్ తో కూడా తను సినిమాను చేస్తున్నాడు.ఇక మీద విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వార్తకైతే వస్తున్నాయి.
ఇక మీదట ఆయన సక్సెస్ లు కొడితే తప్ప ఇండస్ట్రీలో తన మార్కెట్ అనేది భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే లేవు.ఎందుకంటే తనకంటే వెనకాల వచ్చిన విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్లను కొల్లగొడుతుంటే ఇంకా నితిన్ 50 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోతున్నాడు.ఇక మీదట ఆయన సూపర్ సక్సెస్ కొడితే తప్ప ఆయన మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు లేవు…చూడాలి మరి ఈ మూడు సినిమాలతో సక్సెస్ కొడతాడా లేదా.?
.