త్వరలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలుO( Assembly Elections ) రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు.
బీజేపీ అధిష్టానం ఆలోచన మేరకు జనసేనాని పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారని తెలుస్తోంది.కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా మరియు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా( Pithapuram Assembly Constituency ) ఆయన బరిలో దిగనున్నారని సమాచారం.
అయితే తిరుపతి( Tirupathi ) నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ముందుగా భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో పవన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.దీంతో భీమవరం బరిలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పోటీ చేయనున్నారు.కాగా పులపర్తి అంజిబాబు రేపు జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.