Naga Chaitanya : ఆ వ్యక్తి పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన నాగచైతన్య.. గ్రేట్ అంటూ?

సాయి పల్లవి నాగచైతన్య( Naga Chaitanya ) గతంలో లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Naga Chaitanya And Sai Pallavi Celebrate His Assistent Birthday On Thandel Movi-TeluguStop.com

అయితే లవ్ స్టోరీ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్న సినిమా తండేల్( Tandel ).మత్స్యకారుల బ్యాక్‌ డ్రాప్‌లో చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తండేల్ ను నిర్మిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఇదిలా ఉండగా హీరో నాగచైతన్య మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.

తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్( Personal Assistant Venkatesh ) పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు.తండేల్ సినిమా కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

కాగా అసిస్టెంట్ నోరు తీపి చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నాడంటూ చైతన్యపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే తండేల్ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు.దేవిశ్రీ ప్రసాద్‌( Devishri Prasad ) ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.కాగా తండేల్ మూవీ సినిమా కోసం పూర్తిగా తన లుక్ మార్చుకున్నాడు నాగ చైతన్య.

జుట్టు, గడ్డం పెంచేసి రగ్గడ్ లుక్ లోకి మారిపోయాడు.చైతూతో పాటు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఢీ గ్లామర్ లుక్‏లో కనిపించనున్నారు.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తండేల్ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మరి నాగ చైతన్య ఎలాంటి అంచనాలను అందుకుంటారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube