తిరుపతి: హరిరామ జోగయ్య తీరు నచ్చక కాపు సంక్షేమ శాఖకు రాజీనామా చేసినట్లు తిరుపతి కాపు నేతలు వెల్లడించారు.జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ బలిజలు కాపులు కులాల వారందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని చెప్పారు.
హరిరామ జోగయ్యని నమ్మే పరిస్థితిలో లేరని వివరించారు.ఆయన సొంత కొడుకుని వైసీపీలోకి పంపి డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు.కాపులు జనసేనతోనే మా ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.