ప్రస్తుత సమాజంలోనీ ప్రజలు జీవితంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను( Health Problems ) ఎదుర్కొంటూ ఉన్నారు.ఈ సమస్యలను మనం తేలికగా తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే శరీరం యొక్క వివిధ విధులకు అవసరమైన మూలకాలలో లోపాన్ని గుర్తించి సకాలంలో సరి చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.లేకుంటే అవి క్రమంగా మన జీవితాన్ని దుర్భారం చేస్తాయి.
మధ్యతరగతి కుటుంబంలో చాలా మంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.ఏదో ఒక మాత్ర వేసుకొని రెస్టు తీసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు.
కానీ అది రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని బాధిస్తుంది.శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలలో ఐరన్( Iron ) ఎంతో ముఖ్యమైనది.
యుక్త వయసులోని వారికి ఇది ఎంతో అవసరం అని కచ్చితంగా చెప్పవచ్చు.పిల్లలు మరియు పెద్దలలో ఇనుము యొక్క మరొక ముఖ్యమైన పని హిమోగ్లోబిన్ ఉత్పత్తి.
శరీరానికి హిమోగ్లోబిన్( Hemoglobin ) సరిపోకపోతే రక్తహీనతగా మారుతుంది.రక్తహీనత అనేది ఇనుము లోపం వల్ల వచ్చే సమస్య.ఐరన్ లోపం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.ఇందులో భాగంగా శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.నిద్ర లేవగానే హఠాత్తుగా తల తిరగడం( Light Headedness ) ఇందులో ముఖ్యమైనది.అలాగే కూర్చొని లేచినప్పుడు లేదా నిద్ర పోయినప్పుడు తల తిరగడం, అలాగే ఐరన్ తగ్గిపోయి రక్తహీనతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెదడుకు సరిపడా ప్రాణవాయువు అందించలేకపోవడం వల్ల మైకము వస్తుంది.ఇనుము గణనీయమైన లోపం అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
చర్మం పై ప్రభావం లో భాగంగా ఎప్పుడు పెదవులు పొడిబారి పోవడం, పెదవులు పగిలిపోవడం( Cracked Lips ), నోటి మూలలో పగుళ్లు, గుండె కండరాల పని తీరుపై ప్రభావం చూపే ఐరన్ లోపం వల్ల ఛాతీ కొట్టుకోవడం, గుండెల్లో మంట రక్తహీనత వల్ల చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్ళు, ఇనుము లోపం రక్తహీనతలను బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్ చాలా తక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్( Iron Supplements ) తీసుకోవడం మంచిది.లేదంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.ఇందులో ముఖ్యంగా అవిసే గింజలు, గుడ్లు మరియు మాంసం లాంటి వాటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది.