రాష్ట్రానికి ఇందిరమ్మ రాజాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్( Congress ) కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.మంగళవారం చేవెళ్లలో జాతీయ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.ఇందిరమ్మ కమిటీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.అదే విధంగా త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ( Indiramma Committees ) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
‘ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించాం.ప్రతి గ్రామంలో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్యే తో సంతకం పెట్టించుకుని ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి.వీరితో ఇందిరమ్మ కమిటీలను వేసి.ఇళ్లు, పెన్షన్లు, సిలిండర్ సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది’ అని చేవెళ్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఇదే సమయంలో తెలంగాణలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలిచే విధంగా పార్టీ నేతలకు కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.అదేవిధంగా ప్రతిపక్షాలపై సీఎం మండి పడటం జరిగింది.