Cabbage Crop : క్యాబేజీ పంట సాగులో నల్లకుళ్ళు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

క్యాబేజీని( Cabbage ) ఉల్లిగడ్డకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.కాబట్టి ఉల్లి ధరలు అధికంగా ఉంటే క్యాబేజీ ధరలు కూడా అధికంగా పెరుగుతాయి.

 Methods Of Preventing Black Rot Pests In Cabbage Cultivation-TeluguStop.com

రైతులు ఒకేసారి అధిక విస్తీర్ణంలో సాగు చేయడం కంటే విడతల వారీగా సాగు చేయడం మంచిది.చల్లటి తేమతో కూడిన వాతావరణం క్యాబేజీ పంట సాగుకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది.

కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించి బాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.

నేల యొక్క పీహెచ్ విలువ( pH value ) 5.5 నుంచి 6.5 వరకు ఉండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు( Red soils, black soils ) అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.పంట కోసం ఆరోగ్యకరమైన నారు ను ఎంపిక చేసుకోవాలి.

నారు వయసు 25 నుంచి 30 రోజుల మధ్య ఉంటే మంచిది.మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల వరసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

Telugu Black Soils, Cabbage, Methodsblack, Pets, Ph, Red Soils-Latest News - Tel

ఏ పంటను సాగుచేసిన కలుపు ప్రధాన సమస్య.కలుపు సమస్య తొలగిస్తే వివిధ రకాల చీడపీడలు( Pets ) లేదంటే తెగుళ్లు పంటలు ఆశించలేదు.ఒకవేళ ఆశిస్తే వ్యాప్తి తక్కువగా ఉంటుంది.కాబట్టి కలుపు సమస్య తక్కువగా ఉండేందుకు ప్రధాన పొలంలో నారు నాటిన 24 గంటల తర్వాత ఒక ఎకరాకు 1.25 లీటర్ల పెండిమిథలిన్ రసాయనాన్ని ఇసుకలో కలుపుకొని తేమగల నేలపై చల్లుకోవాలి.ఈ రసాయనం మొక్కలపై పడకుండా జాగ్రత్తగా చల్లుకోవాలి.

Telugu Black Soils, Cabbage, Methodsblack, Pets, Ph, Red Soils-Latest News - Tel

క్యాబేజీ పంటకు తీవ్ర నష్టం కలిగించే నల్ల కుళ్ళు తెగుళ్ల నివారణ కోసం రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.మొక్క ఆకులపై ముదురు గోధుమ రంగు చుక్కలు ఏర్పడి క్రమంగా పెరుగుతూ ఉంటే ఆ మొక్కకు నల్ల కుళ్ళు తెగుళ్లు ఆశించినట్టే.దీని నివారణ కోసం ఒక లీడర్ నీటిలో ఐదు మిల్లీలీటర్ల స్త్రెప్టోసైక్లిన్ ను కొన్ని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube