ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( YS Sharmila ) మంత్రి రోజా( Minister Roja ) కౌంటర్ ఇచ్చారు.షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారన్నారు.
వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకునే షర్మిల వైఎస్ కు పేరు తెచ్చే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు( Chandrababu ) వదిలిన బాణంలా పని చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం జగన్ పని చేస్తుంటే వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారని విమర్శలు చేశారు.జగన్( CM Jagan ) మాత్రమే నిజమైన రాజన్న బిడ్డ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరి జగనన్నపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.