తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupally Krishna Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు( Krishna River Management Board ) కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
నీటి పంపకాల వ్యవహారంపై బీఆర్ఎస్ ( BRS ) కొత్త నాటకానికి తెర తీసిందని విమర్శించారు.పరువు నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కృష్ణా నీటి వాటా కోసం కేంద్రాన్ని బీఆర్ఎస్ అడగలేదని చెప్పారు.
అలాగే కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదని మండిపడ్డారు.కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వకుండానే సుప్రీంకోర్టులో( Supreme Court ) కేసు విత్ డ్రా చేసుకున్నారని వెల్లడించారు.రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించారన్న మంత్రి జూపల్లి కుట్రలో భాగంగానే ఏపీకి గత ప్రభుత్వం సహకారం అందించిందని ఆరోపించారు.